హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

ఖమ్మం: తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్‌ దివాకర టీఎస్‌ అన్నారు. శనివారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 131వ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు.