KRNL: ఆదోని ఆర్‌ఆర్ లేబర్ కాలనీ ప్రధాన రహదారి, ఆవుదూడ వంక వద్ద రక్షణగా పహారీ నిర్మించాలని సీపీఎం పట్టణ అధ్యక్షుడు వీరేశ్ డిమాండ్ చేశారు. మూడు నెలల క్రితం ఇదే సమస్యపై నిరాహార దీక్ష చేపట్టినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా పహారీ నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తిరిగి నిరాహార దీక్ష చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పహారీ నిర్మించకపోతే మళ్లీ నిరాహార దీక్ష


