హైదరాబాద్: 28°C
తెలంగాణ

28న కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా

WNP: ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం (28న) జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ శాంతియుతంగా నిరసన చేపట్టాలని డీసీసీ అధ్యక్షులు శివసేనారెడ్డి తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నారు.