హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌ను ఢీకొట్టిన కారు.. టీచర్‌కు గాయాలు

PPM: జియ్యమ్మవలస మండలం చింతల బేలగం సమీపంలో శనివారం ఉదయం కారు-బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడు కురుపాం మండలానికి చెందిన టీచర్ గౌతమ్‌గా గుర్తించారు. ఆయనను 108లో ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు.