W.G: తాడేపల్లిగూడెం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తణుకు నుంచి తిరిగి వచ్చిన పాతూరు నివాసి మర్రిపూడి సుబ్బులు బస్సు వెనుక నుంచి దిగుతుండగా ప్రమాదానికి గురయ్యారు. డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు కదపడంతో ఆమె కాలుపై నుంచి చక్రం వెళ్లి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పట్టణ ఎస్సై వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెంలో బస్సు ప్రమాదం... మహిళకు గాయాలు


