హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో BRS గెలవాలి: సాధిఖ్

MBNR: వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో BRS విజయం సాధించాలని ఆ పార్టీ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ఆకాంక్షించారు. పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడే నేతలకు అవకాశం ఇవ్వాలని అన్నారు. రాజకీయ పునరావాసం కోసం కాకుండా ప్రజాసమస్యలపై గళం వినిపించే వారిని ఎన్నుకోవాలని సూచించారు.