హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాకింగ్ చేస్తూ వాకర్ మృతి

NLR: కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో ఉన్న మినీ స్టేడియం మైదానంలో ఇవాళ ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. దంతం వారి వీధికి చెందిన హరి వాకింగ్ చేస్తూ అకస్మాత్తుగా కుప్ప కూలిపోయాడు. సహచర వ్యక్తులు వెంటనే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.