హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజులపల్లె రైల్వే గేట్ బంద్

NDL: మహానంది క్షేత్రం నుంచి బోయిలకుంట్లమెట్ట గ్రామాలకు వెళ్లే మార్గంలోని గాజులపల్లె ఆర్.ఎస్. రైల్వే గేటును ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే పనుల కారణంగా గేటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, గ్రామాల ప్రజలు, రైతులు విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.