హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో మొసలి కలకలం

KNR: హుజూరాబాద్ మండలం జూపాక మైసమ్మ చెరువులో శుక్రవారం మొసలి ప్రత్యక్షం కావటంతో గ్రామీణులు భయాందోళనకు గురయ్యారు. రెండురోజులుగా చెరువులో మొసలి సంచరిస్తుందనే ప్రచారం సాగగా మత్స్యకారులు చెరువు పరిసరాల్లో గాలించారు. అటవీశాఖ అధికారులు మొసలిని పట్టుకొని దూరప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.