తెలంగాణ
గుంతలమయంగా NH-65.. ప్రమాదాలకు ఆహ్వానం
NLG :నార్కట్‌పల్లి మండలం చిట్యాల వద్ద HYD–VIJ జాతీయ రహదారి (NH-65) అధ్వానంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రహదారిపై బీటీ కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారుల తప్పిదాలతో పాటు రహదారి లోపాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాహనాలు అదుపుతప్పితే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


