హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ్రమ పాఠశాలలో CRT పీడీ మిస్సింగ్

ASF: కెరమెరి మండలం కొత్తగూడకు చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాలలో CRT పీడీగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యారు. ఈనెల 23న పాఠశాలకు సెలవు పెట్టి ఆదిలాబాద్ వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో రాత్రి 7 గంటల సమయంలో కెరమెరిలో కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఇంటికి చేరకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై రాజు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.