హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న భక్తులకు డిజిటల్ సేవలు

SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నగదు రహిత సేవలను విస్తృత పరిచేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులు ప్రసాదాలు, వివిధ సేవలు ఆలయంలో పొందేందుకు డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, భీమేశ్వరసదన్ డిజిటల్ కియోస్క్ యంత్రాలు ఏర్పాటు చేశారు.