KRNL: దేవనకొండ మండలంలో పి.కోటకొండ–లక్కసాగరం గ్రామాలను కలిపే నూతన రహదారి నిర్మాణానికి టీడీపీ నాయకులు భూమి పూజ నిర్వహించారు. రూ.4.5 కోట్ల అంచనా వ్యయంతో 7.5 కి.మీ. మేర రహదారి నిర్మించనున్నారు. పనులు పూర్తైతే పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభమై, ప్రయాణ సమయం తగ్గుతుందని ఆలూరు టీడీపీ ఇంఛార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నూతన రహదారి నిర్మాణానికి భూమి పూజ


