హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రీడలకు తమ ప్రోత్సాహం: ఎమ్మెల్యే

ATP: ఆర్డీటీ రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డిని ఇన్‌ఛార్జి కృష్ణారెడ్డి, సీనియర్ క్రీడాకారుడు కందన్ ఇవాళ ఆహ్వానించారు. క్రీడలకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ నెల 29న తాడిపత్రి జూనియర్ కళాశాలలో జరిగే ఈ ఎంపికల్లో గ్రామీణ క్రీడాకారులు పాల్గొనాలని కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.