హైదరాబాద్: 28°C
తెలంగాణ

గన్నారంలో తీరని దాహం.. 15 రోజులుగా నీటి కష్టాలు

WGL: రాయపర్తి మండలంలోని గన్నారం గ్రామంలో గత 15 రోజులుగా తీవ్ర తాగునీటి కొరత నెలకొంది. వర్షాకాలంలోనూ నీరు అందక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను సర్పంచు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని శనివారం గ్రామస్తులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.