హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌లో కిక్కిరిసిన జనం

HYD: నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు ఇంకా కొనసాగుతోన్నాయి. ఖైరతాబాద్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు భారీ గణపతులు క్యూ కట్టాయి. రద్దీ దృష్ట్యా ఉదయం సిటీ లోపలికి వచ్చే ప్రైవేట్ బస్సులను అధికారులు ఎల్బీనగర్‌లో నిలిపివేసినట్లు సమాచారం. దీంతో అమీర్ పేట, SRనగర్, మియాపూర్ వైపు వెళ్లే ప్రజలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉదయం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌లో రద్దీ నెలకొంది.