హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండేళ్ల నిరీక్షణకు తెర.. చినపాచిలకు బస్సు

AKP: రావికమతం మండలం చినపాచిల గ్రామానికి రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ కొమార రాజులు, వైఎస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొమార ప్రసాద్ తదితరులు ఆర్టీసీ అధికారులతో చర్చించి బస్సు సౌకర్యం కోసం కృషి చేశారు. వారి ప్రయత్నంతో అనకాపల్లి నుంచి చినపాచిలకు బస్సు ప్రారంభమైంది.