హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు

KDP: దేవునికడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. వేద మంత్రాల మధ్య హోమ క్రతువులు పూర్తి చేసి పవిత్ర జలాలను ఆలయ ప్రాంగణంలో ప్రోక్షించారు. ఉత్సవమూర్తులకు, సుదర్శన చక్రతాళ్వార్లకు విశేష తిరుమంజనం నిర్వహించి చక్రస్నానం చేయించారు.