హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుడిపై కత్తులతో దాడి!

VSP: యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా భీమునిపట్నంలో జరిగింది. ప్రేమ పెళ్లి నేపథ్యంలో మజ్జిపేటకు చెందిన యువకుడితో పాటు ఆరుగురిపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. ఘటనను చిత్రీకరిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పైనా కత్తితో దాడి చేశారు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.