తిరుపతిలో అవిలాల ప్రాంతంలోని 64.27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు శ్రీస్వామి హథీరాంజీ మఠానికి మార్గం సుగమమైంది. సర్వే నం. 13, 15, 17లోని భూములను ఖాళీ చేయాలని మఠం నోటీసులు ఇచ్చింది. దీంతో 13 మంది సుప్రీంకోర్టులో పిటిషన్‌లు వేశారు. ఈ భూములు మఠానివేనని స్టేట్ గవర్నమెంట్ తెలపడంతో వాటిని న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.
ఆంధ్రప్రదేశ్
అవిలాల భూముల స్వాధీనానికి గ్రీన్ సిగ్నల్


