హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళేశ్వరం వద్ద కొనసాగుతున్న గోదావరి ప్రవాహం

BHPL: మహాదేవపురం మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద శనివారం గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 5.660 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి 75 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో అధికారులు 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.