హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం'

SKLM: తుఫాన్ కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేని ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ తెలిపారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఐదు రోజులుగా మత్స్యకారుల ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. మత్స్యకారుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు స్పందించి ఈ సహాయం అందించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.