హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం

PLD: మేడికొండూరు మండలం కొర్రపాడులో అప్పుల బాధతో కౌలు రైతు బాజీ (35) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పొలంలో బైక్‌లోని పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.