హైదరాబాద్: 28°C
తెలంగాణ

పౌర్ణమి వేళ జమ్ములమ్మ అమ్మవారికి విశేష పూజలు

GDWL: జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి పౌర్ణమి శనివారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణతో దివ్య పూజలు నిర్వహించారు. పవిత్ర పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని వెండి రూపములో అలంకరిచారు.