SKLM: ఇచ్ఛాపురం మండల పరిధి మండపల్లిలో అమ్మవారి ఆలయం సమీపంలోని చేతిపంపు కొన్ని నెలలుగా మరమ్మతులకు గురైంది. దీంతో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. బోరు చుట్టూ పనికిరాని మొక్కలు పెరిగి అధ్వానంగా మారిందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చేతిపంపును మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మండపల్లిలో మరమ్మతులకు గురైన చేతిపంపు


