హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేగవరంలో ముందస్తు పారిశుద్ధ్య చర్యలు

ELR: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం గ్రామంలో ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పంచాయతీ అధికారి దాసరి రాంబాబు ఆధ్వర్యంలో గ్రామంలోని వీధులు, ప్రధాన కూడళ్లలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.