ASR: డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతీలో ఇటీవల కురిసిన వర్షాలు ప్రకృతి అందాలను మరింత పెంచాయి. విస్తారంగా కురిసిన వర్షాలకు వరి చేలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. కొండల మధ్య విస్తరించి ఉన్న పంట పొలాలు భూమికి పచ్చని రంగు పూసినట్లుగా కనువిందు చేస్తున్నాయి. పచ్చని పొలాలు, మేఘావృతమైన కొండలు ప్రకృతి ప్రేమికులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పచ్చదనంతో విరబూసిన సొవ్వ పంచాయతీ


