హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లె మండలంలో 29న ఎస్ఎంసీ ఎన్నికలు

అన్నమయ్య: మదనపల్లె మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నట్లు శుక్రవారం వెల్లడించారు. మండలంలో 101 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 27 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 135 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని తెలిపారు.