హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంకా తగ్గని వరద ఉద్ధృతి

KKD: వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతుండటంతో సామర్లకోట–పిఠాపురం ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారిపై వరద నీరు చేరడంతో సాధారణ వాహనాల రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. వరద నీటి మట్టం తగ్గకపోవడంతో ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, ఇతర తేలికపాటి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.