హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెబ్బేరు బస్టాండ్‌కు మహర్దశ

WNP: పెబ్బేరు ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.39 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ బెడ్ పనులు పూర్తయ్యాయని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నేడు ఎమ్మెల్యే మేఘారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మార్కెట్ యార్డులో జరిగే రైతు ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.