హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉద్యోగుల గ్రీవెన్స్: కలెక్టర్

అల్లూరి జిల్లాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రతి 3వ శనివారం (నేడు) గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఉద్యోగులు తమ విధులకు సంబంధించిన సమస్యలను నేరుగా తెలియజేయవచ్చన్నారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన అంశాలు మినహాయించి ఇతర సమస్యలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.