హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాకింగ్ చేస్తుండగా బైక్‌తో ఢీ.. స్పాట్ డెడ్!

WGL: ఖిలా వరంగల్ మండలం 39వ డివిజన్‌కు చెందిన బత్తుల కిషన్ శనివారం ఉదయం జన్మభూమి జంక్షన్ రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. మద్యం మత్తులో వేగంగా వచ్చిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంతో కిషన్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.