హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగావళి వరదతో తీర గ్రామాల్లో అలజడి

PPM: నాగావళి నదికి వరద ఉధృతి పెరగడంతో తీర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తోటపల్లి బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో అంపిలి, అన్నవరం, ఎరకరాయపురం, మంగళాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండాపురం, వడమ, తంపటాపల్లి, గోపాలపురం తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల వరి పంట నీటమునిగింది.