హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాధితులకు సాయం చేస్తే రివార్డు'

ASR: రోడ్డు ప్రమాద బాధితులను ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి తరలించేవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ సమారిటన్ (PM రాహ్-వీర్) పథకం కింద రూ.25వేల నగదు రివార్డు, ప్రశంసాపత్రం అందజేస్తోందని జిల్లా రవాణాశాఖ అధికారి ప్రకాశరావు తెలిపారు. సాయం చేసేవారికి చట్టపరమైన రక్షణ కల్పిస్తారు. వ్యక్తిగత వివరాలు తెలపాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదం జరిగితే సహాయం అందించాలని కోరారు.