హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 28 నుంచి అండర్-19 ఎస్‌జీఎఫ్‌ జట్ల ఎంపికలు

NTR: ఉమ్మడి కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి అండర్-19 బాలురు, బాలికల జిల్లా క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి వి.రవికాంత్ తెలిపారు. కృష్ణలంక, పటమట, ప్రసాదంపాడు, ఇబ్రహీంపట్నంతో పాటు విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో చెస్, రగ్బీ, క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి పోటీల ఎంపికలు జరగనున్నాయి. వివరాలకు 9440112455 నంబరును సంప్రదించవచ్చు.