హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రిమ్స్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి'

ADB: ఆదిలాబాద్ రిమ్స్ SNCU యూనిట్‌లో ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని CPM పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శుక్రవారం పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిమ్స్‌లో మందుల కొరత, పనిచేయని లిఫ్టులు, ఏసీల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.