హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల ప్రమాదకర ప్రయాణం

BHNG: భువనగిరి పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. బస్సుల్లో సీట్లు లేకపోవడంతో విద్యార్థులు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. వరంగల్‌–హైదరాబాద్‌ మార్గంలో ఈ దృశ్యాలు కనిపించాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.