హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్

కరీంనగర్ పట్టణంలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి లోపాలు లేకుండా ప్రోటోకాల్ పాటించాలన్నరు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సమావేశ మందిరం, అతిథుల సీటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.