హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

VZM: మార్కాపురంలో త్వరలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక రేపు ఉదయం 8 గంటలకు విజయనగరం కస్పా పాఠశాల మైదానంలో జరుగుతుందని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షలు రంగారావుదొర తెలిపారు. 2006 నవంబర్ తర్వాత జన్మించిన బాలబాలికలు అర్హులన్నారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని, వివరాలకు 9949721949 సంప్రదించాలన్నారు.