హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేడుకలకు ముస్తాబైన ఒంగోలు

ప్రకాశం: ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి ఈ నెల 30తో 150 సంవత్సరాలు పూర్తికానున్న నేపథ్యంలో నగరం ఉత్సవ శోభను సంతరించుకుంది. ప్రధాన రహదారుల్లో ఆకర్షణీయమైన స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. డివైడర్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. బహిరంగ సభ జరగనున్న మినీస్టేడియంలో వేదికతో పాటు ఇతర ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.