TPT: తిరుమల రాంభగీచ సర్కిల్ వద్ద టీటీడీ ఉచిత బస్సులో పిక్‌పాకెట్‌కు పాల్పడిన తమిళనాడుకు చెందిన మురుగన్ నాగరాజు @శంకర్ రావు(52)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 1000 నగదు, రెండు సెల్ ఫోన్‌లు, నకిలీ టీటీడీ ఉద్యోగి ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గతంలోను భక్తులను మోసం చేసిన నేర చరిత్ర ఉండటంతో, నిందితుడికి కోర్డు 15రోజుల పాటు రిమాండ్ విధించింది.
ఆంధ్రప్రదేశ్
నకిలీ టీటీడీ ఉద్యోగి అరెస్ట్!


