కృష్ణా: పెదనలో హెచ్‌ఏఎం పథకం కింద మంజూరైన రూ.12 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.91 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేయనున్నారు. 19-20 వార్డుల్లో 7 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఇంటర్ లింక్ బీటీ రోడ్డుతో పాటు మరో 11 పనులను ప్రారంభించనున్నట్లు కమిషనర్ డొక్కా కొండయ్య తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.12.91 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


