BHNG: భువనగిరి పట్టణంలోని వైఎస్సార్ గార్డెన్ పక్కన ఉన్న ఆవాస ప్రాంతంలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటిని రోడ్డుపైకి, ఖాళీ స్థలాల్లోకి వదులుతుండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. గుంతలతో రహదారులు అధ్వానంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రోడ్లు లేక.. గుంతలతో అవస్థలు


