ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే గేట్ రోడ్డు జాతీయ రహదారి పక్కన అధ్వానంగా మారింది. రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే గోతుల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గోతులమయంగా చేబ్రోలు రైల్వే గేట్ రోడ్డు


