హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 30న మెగా జాబ్ మేళా

ASR: పాడేరులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30న అరకులోయ నివాసానుబంధ ఐటీఐలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో నిన్న జాబ్ మేళా ప్రచార గోడపత్రికను ఆవిష్కరించారు. 12 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. గిరిజన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.