హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

SRPT: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం ప్రభావంతో మండలవ్యాప్తంగా తీవ్ర గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి శుక్రవారం రాత్రి ఆర్లెగూడెం, నారాయణపురం గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ నియంత్రికలు సైతం కిందపడటంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.