హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణనాథునికి 108 రకాల నైవేద్యాలు

PPM: పార్వతీపురం పట్టణంలోని కంచరి వీధిలో వినాయక చవితి సందర్భంగా భక్తులు గణనాథుడికి విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం విఘ్నేశ్వరుడికి 108 రకాల పిండివంటలు, వివిధ రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు.