హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారాహి ఆలయ వివాదం... రంగంలోకి మంత్రి సుభాష్

KKS: కొరుపల్లి కాశీ వారాహి ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవడంతో వివాదం నెలకొంది. ఆలయ ధర్మకర్త, జనసేన నేత దొరబాబు ఆలయం తిరిగి ఇవ్వాలంటూ కలెక్టర్, ఎండోమెంట్ డీసీ, MRO కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి సుభాష్ రంగంలోకి దిగారు. దొరబాబును వెంటబెట్టుకుని దేవాదాయశాఖ మంత్రిని కలిసి ఆలయాన్ని తిరిగి అప్పగించాలని కోరినట్లు సమాచారం.