E.G: రాజానగరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. సెప్టెంబర్ 29, 30 తేదీల్లో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రూ. 20 కోట్లకుపైగా అంచనా వ్యయంతో 19 రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రహదారుల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు


