E.G: భారీ వర్షాలు, వరదలతో బొమ్మూరు నుంచి కోరుకొండ వైపు వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారింది. రహదారిపై నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేశారు. వాహనదారులు, ప్రయాణికులు ఈ మార్గంలో వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బొమ్మూరు-కోరుకొండ రహదారి మూసివేత


